
నవ భారత నిర్మాత రాజీవ్‌గాంధీ
జగిత్యాలటౌన్: నవ భారత నిర్మాత స్వర్గీయ రాజీవ్‌గాంధీ అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం ఇందిరాభవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రాజీవ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలనకు ఆయన కృషిని మరువలేమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, పీసీసీ కార్యదర్శి బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, నక్క జీవన్, రఘువీర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మపురిలో..
ధర్మపురి: రాజీవ్‌గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని విప్ అడ్లూరి అన్నారు. ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. నాయకులు ఎస్ దినేష్, వేముల రాజు, సింహరాజు ప్రసాద్, చిలుముల లక్ష్మణ్ తదితరులున్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభం
మేడిపల్లి: మేడిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ సత్య ప్రసాద్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు. కట్లకుంటలో బీరప్ప కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ మాదం వినోద్ నాయకులు పాల్గొన్నారు.
కేసీఆర్‌కు నోటీసులు కక్ష సాధింపు చర్య
జగిత్యాల: కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యేనని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ మంచి పరిపాలన అందించారని, ప్రజలు, రైతులకు నీరు అందించాలని కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని, అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని తెలిపారు. పంటలకు నీరు అందించక ఎండబెట్టిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదన్నారు. కేసీఆర్‌కు వస్తున్న ఆదరణ చూసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యేనని పేర్కొన్నారు.
ధర్మపురిలో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని ప్రసన్నాంజనేయ స్వామిని భక్తులు దర్శించుకున్నారు. ముందుగా గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీలక్ష్మీనృసింహ స్వామివారిని దర్శించుకున్నారు.
కొలతల ప్రకారం విద్యార్థులకు దుస్తులు
జగిత్యాలరూరల్: విద్యార్థులకు కొలతల ప్రకారమే దుస్తులను మహిళా సంఘాల సభ్యులతో కుట్టి ఇవ్వనున్నట్లు డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. పొరండ్లలోని గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో మహిళా సంఘం సభ్యులు కుడుతున్న ఏకరూప దుస్తుల యూనిట్‌ను సందర్శించారు. జిల్లాలో పాత 18 మండలాల్లో క్లస్టర్ల వారీగా కుట్టు కేంద్రాలను ఏర్పాటు చేసి దుస్తులు కుట్టిస్తున్నట్లు పేర్కొన్నారు.

నవ భారత నిర్మాత రాజీవ్‌గాంధీ

నవ భారత నిర్మాత రాజీవ్‌గాంధీ

నవ భారత నిర్మాత రాజీవ్‌గాంధీ