
ఉపాధ్యాయులకు శిక్షణ
● నేటినుంచి జిల్లాస్థాయి తరగతులు ప్రారంభం ● ఈనెల 17 వరకు కొనసాగింపు ● ఐదు అంశాలపై అవగాహన ● 20నుంచి24 వరకు రెండో స్పెల్ ● 27 నుంచి 31 వరకు మూడో స్పెల్
జగిత్యాల: జిల్లాలోని ఉపాధ్యాయులకు మంగళవారం నుంచి వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి స్పెల్ ఈనెల 17 వరకు నిర్వహించనున్నారు. రెండో దశ ఈనెల 20 నుంచి24 వరకు.. మూడో దశ 27 నుంచి 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఐదు రోజుల చొప్పున నిర్వహించే ఈ శిక్షణ శిబిరాలు మూడు విడతలు.. మూడువారాలపాటు నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. తరగతుల ప్రారంభానికి ముందు సంసిద్ధత సమావేశం నిర్వహించారు. ఎస్‌ఏ ఇంగ్లిష్, గణితం, సోషల్ సబ్జెక్ట్‌ల ఉపాధ్యాయులు, మండల రిసోర్స్ పర్సన్స్, ఉర్దూమీడియం, ప్రైమరీ టీచర్లు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పాల్గొననున్నారు.
మూడు కేంద్రాలో ఏర్పాటు
మొదటి విడత శిబిరంలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల కు జిల్లాకేంద్రంలోని మానస హైస్కూల్, మండల రిసోర్స్ పర్సన్లకు జీహెచ్‌ఎస్ పురాణిపేటలో, మ్యా థ్స్ టీచర్లకు జెడ్పీహెచ్‌ఎస్ ధరూర్ క్యాంప్‌లో మూ డు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి ఒ క్క ఉపాధ్యాయులు పాల్గొనాల్సి ఉంది. ఒక్కరికి కూ డా మినహాయింపు లేదని అధికారులు పేర్కొన్నారు.
విద్యార్థులకు ఎంతో మేలు
శిక్షణ శిబిరంలో ఉపాధ్యాయులకు అన్ని విషయాలపై అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా అ ర్టిఫిషియల్ ఇంటలీజెన్సీ, లెర్నింగ్స్ అవుట్స్ లాంటి అంశాలలో శిబిరం నిర్వహిస్తున్నారు కాబట్టి విద్యార్థులకు ఎంతో మేలు కలగనుంది. ప్రతి రోజు ఉద యం 9 గంటలలోపు శిబిరం ప్రారంభం కానుంది.
ఉపాధ్యాయులందరూ హాజరు కావాలి
శిబిరాల్లో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పాల్గొనాల్సిందే. ఏ ఒక్కరికి కూడా మినహాయింపు లేదు. కేంద్రానికి చేరుకుని కోర్సు డైరెక్టర్లకు రిపోర్ట్ చేయాలి. ఈ శిబిరంలో ఆయా కోర్సులపై అంశాలను బోధించనున్నారు.
– రాము, డీఈవో
శిక్షణలో అంశాలివే..
ఐదు రోజుల పాటు జరగనున్న ఈ శిక్షణ శిబిరంలో పలు అంశాలను బోధించనున్నారు. ఇందులో కంటెంట్ ఎన్‌రిచ్‌మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్, అర్టిఫిషియల్ ఇంటిలీజెన్సీ, లెర్నింగ్ అవుట్ కామ్స్ నేర్పించనున్నారు.

ఉపాధ్యాయులకు శిక్షణ