
అందరికీ చదవదం, రాయడం రావాలి
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): చదువు లేకుంటే వెనుకబడిపోతామని డీఆర్‌డీవో, మండల ప్రత్యేకాధికారి రఘువరన్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఐకేపీ భవనంలో మహిళ గ్రామైక్య సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అక్షార్యాస్యతలో మనం చాలా వెనుకబడి ఉన్నామని, చదవడం, రాయడం తప్పకుండా రావాలని సూచించారు. ఒక కుటుంబంలో ఒక మహిళ చదువుకోవడం వల్ల క్రమశిక్షణ ఉంటుందని, చదువు వల్ల అనేక లాభాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, సంఘాల సభ్యులు చిన్నచిన్న పరిశ్రమలు పెట్టాలని కోరారు. అనంతరం ఇబ్రహీంపట్నం మహిళా సంఘం ఆధ్వర్యంలో కందిపప్పు అమ్మకాలను ప్రారంభించారు. ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంఈవో మధు, ఎపీఎం శంకర్, మెట్‌పల్లి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, మహిళ సమైక్య అధ్యక్షురాలు రాధిక పాల్గొన్నారు.