
కొండగట్టులో డిప్యూటీ సీఎం సతీమణి పూజలు
మల్యాల:కొండగట్టు అంజన్నను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని కుమారునితో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి శాలువాతో సన్మానించారు.
ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని హనుమాన్‌వాడలో ద్విచక్రవాహనంపై వస్తున్న పాదం మల్లేశం, వితన్విల మృతికి కారణమైన నస్పూరి మణిదీప్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. మల్లేశం, ఆయన సోదరుడి కూతురు వితన్వి సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై వస్తుండగా మణిదీప్ అతిగా మద్యం సేవించి అతివేగంగా కారు నడిపి ఢీకొట్టాడు. ఈ ఘటనలో మల్లేశం, వితన్వి మృతిచెందారు. మల్లేశం సోదరుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు మణిదీప్‌పై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై గీత, ఏఎస్‌ఐ మోహన్, కానిస్టేబుల్ జీవన్ పాల్గొన్నారు.
వడదెబ్బతో ఒకరి మృతి
వెల్గటూర్: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని జగదేవుపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సయ్య (46) రెండురోజులు ఎండలో వ్యవసాయ పనులకు వెళ్లాడు. వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. నర్సయ్యకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య
కోరుట్ల: పట్టణంలోని అల్లమయ్యగుట్ట చింతలవాడకు చెందిన టేకి సాయిలు (35) మంగళవా రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ని జామాబాద్ జిల్లా నవీపేట్ మండలం లింగా పూర్‌కు చెందిన సాయిలు కొంతకాలంగా ఇక్క డ హమాలీగా పనిచేస్తున్నాడు. రెండునెలల క్రితం సాయిలు తల్లి అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉంటున్నాడు. నాలుగురోజుల క్రితం భార్య పిల్లలతో కలిసి నిజామాబాద్‌లోని తల్లిగారింటికి వె ళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయిలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చు ట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కొండగట్టులో డిప్యూటీ సీఎం సతీమణి పూజలు

కొండగట్టులో డిప్యూటీ సీఎం సతీమణి పూజలు