
విచారణ ఏమైనట్టు..?
● వైద్య విధాన పరిషత్ కుంభకోణం నిధులు రికవరీ అయ్యేనా ● ఏడాదిగా ముందుకు సాగని విచారణ ● బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదంటున్న ఉద్యోగులు
జగిత్యాల: జిల్లా వైద్య విధాన పరిషత్‌లో పనిచేసే ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలోని నిధులను ఆ శాఖ లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు మాయం చేయగా వారిని సస్పెండ్ చేశారు. ఉద్యోగులకు డీ ఏ, ఏరియర్స్, సరెండర్ లీవ్స్‌కు సంబంధించిన నగ దు ప్రతి ఆరునెలలకోసారి లెక్క చూసి వారి జీపీఎఫ్ ఖాతాల్లో జమచేయాల్సి ఉంటుంది. కాగా, వై ద్య విధాన పరిషత్‌లో అకౌంట్స్ విభాగంలో పనిచేసే కొందరు ఉద్యోగులు జీపీఎఫ్ ఖాతాలో జమచేసే నిధులు పక్కదారి పట్టించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ‘సాక్షి’లో గతేడాది జూన్ 16న ‘జీపీఎఫ్ నిధులు మాయం’ శీర్షికన కథనం ప్ర చురి తమైంది. దీంతో స్పందించిన అధికారులు దాదాపు రూ.5 కోట్ల వరకు కుంభకోణం జరిగినట్లు వెల్లడించారు. గతేడాది కుంభకోణం జరుగగా, ఇప్పటికీ విచారణ కొనసాగుతుందే తప్ప ముందుకు వెళ్లడం లేదు.
రికవరీ పేరిట జాప్యం..
● వైద్య విధాన పరిషత్‌లో కుంభకోణంపై బాధ్యులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని డబ్బులు పోయిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● దాదాపు రూ.5 కోట్ల నిధులు గోల్‌మాల్ అయినట్లు గుర్తించగా, రూ.2 కోట్లు రికవరీ చేసినట్లు తెలిసింది. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
● అవినీతిని కప్పిపుచ్చేందుకు రికవరీ పేరుతో కాలం వెళ్లదీస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇందులో ఓ అధికారి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.
● ఉద్యోగులకు సంబంధించిన సీపీఎఫ్, జీపీఎఫ్ మాయం చేసినా పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
● ఈ కుంభకోణానికి పాల్పడ్డ అధికారులపై సస్పెండ్ వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకు క్రిమినల్ చర్యలు తీసుకోకపోవడంతో ఇందులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.
● విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని బాధిత ఉద్యోగులు కోరుతున్నారు. గతంలో ఈ విషయం వెలుగులోకి వచ్చిన అనంతరం ఓ వారం రోజులు హడావుడి చేశారే తప్ప మళ్లీ ఎక్కడికక్కడే నిమ్మకుండిపోయారు.
● ఇంత పెద్ద స్కాం జరిగినా ప్రధాన సూత్రధారి ఎవరనేది ఇంతవరకు తెలియడం లేదు. ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్, డీఏలకు సంబంధించి చెక్కులు, ఓచర్లు మాయం అయినా పూర్తిస్థాయిలో విచారణ ఎందుకు చేపట్టడం లేదో తెలియడం లేదు.
విచారణ అధికారులెవరో?
గతంలో బాన్సువాడ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ప్రసాద్‌ను వైద్య విధాన పరిషత్‌లో జరిగిన కుంభకోణానికి సంబంధించి విచారణ అధికారిగా నియమించారు. కానీ, ఎవరు అధికారిగా ఉన్నారన్న విషయం తెలియకుండా ఉంది. గతంలో అతను వచ్చి జగిత్యాల మాతాశిశు సంక్షేమ కేంద్రంలోని డీసీహెచ్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. హైదరాబాద్ నుంచి మరో ఇద్దరు అధికారులు వచ్చి వెరిఫికేషన్ చేశారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. ఎంత కుంభకోణం జరిగిందో తెలుసుకునేందుకు అధికారులు గత నాలుగేళ్లకు సంబంధించిన ఓచర్ల వెరిఫికేషన్, రికార్డులన్నింటినీ పరిశీలించారు.
మూడు రోజుల్లో నివేదిక
వైద్య విధాన పరిషత్ కుంభకోణానికి సంబంధించి కొంత మేర డబ్బు రికవరీ అయింది. ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. 2–3 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక వస్తుంది. ఎన్ని నిధులు రికవరీ అయ్యాయో తెలుస్తుంది. విచారణలో జాప్యం ఏమీ లేదు.
– రామకృష్ణ, డీసీహెచ్

విచారణ ఏమైనట్టు..?