
మమ్మల్ని గుర్తించలేదు
ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్న. మా గ్రామంలో వందలాది దరఖాస్తులు వచ్చాయి. కేవలం 35మందిని ఎంపిక చేిసి సర్వే కూడా పూర్తి చేశారు. మాకు సొంతిల్లు లేదు. అయినా మమ్మల్ని గుర్తించలేదు.
– శ్రీరాముల శ్రీవాణి, దరఖాస్తుదారు, రాఘవపేట
పారదర్శకంగా ఎంపిక
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం మొదటి విడతగా మండలానికి 725 ఇళ్లు కేటాయించారు. వీటిని అన్నిగ్రామాలకు సర్దుబాటు చేసి పారదర్శకంగా సర్వే చేసి ఇళ్లు కేటాయించాం. ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కొత్తదాంరాజుపల్లిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాం. – శశికుమార్‌రెడ్డి, ఎంపీడీవో, మల్లాపూర్
అనర్హులను ఎంపిక చేయొద్దు
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అనర్హులను ఎంపిక చేయొద్ద్దనిఅధికారులను ఆదేశించాం. ఎక్కడైనా అర్హత ఉండి ఇల్లు మంజూరు కాకుంటే నా దృష్టికి తేవాలి. పార్టీలకతీతంగా పేదలకు ఇళ్లు కేటాయించడమే ప్రభుత్వ లక్ష్యం.
– అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రభుత్వ విప్

మమ్మల్ని గుర్తించలేదు

మమ్మల్ని గుర్తించలేదు