
గ్రామాల అభివృద్ధే ధ్యేయం
పెగడపల్లి(ధర్మపురి): పల్లెల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందకు సాగుతుందని, ఇందులో భాగంగా పనుల జాతర–2025 కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శు క్రవారం మండలంలోని లింగాపూర్‌లో రూ.40 లక్షలతో సీసీ రోడ్లు, రూ.12 లక్షలతో అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన, అయితిపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానా భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాజకీయాలకతీతంగా జ రుగుతున్న అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములై సద్వి నియోగం చేసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ప్రతి పేదోడికి ప్రభుత్వ వై ద్యం అందాలన్న ఉద్దేశంతో గ్రామాల్లో పల్లె ద వఖానాలు అందుబాటులోకి తెచ్చి మెరుగైన సే వలు అందించడం జరగుతుందన్నారు. ఏఎంసీ చై ర్మన్ రాములుగౌడ్, అదనపు కలెక్టర్ బీఎస్ ల త, ఆర్డీవో మధుసూదన్, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, డీడబ్ల్యూవో నరేశ్, డీఆర్డీవో రఘువరణ్, సీడీపీవో వీరలక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ రవీందర్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.
అభివృద్ధి శంకుస్థాపన
ధర్మపురి: మండలంలోని నర్సయ్యపల్లెలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రారంభించారు. నేరెల్ల లో అంగన్‌వాడీ భవనం, గోవిందుపల్లెలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎస్.దినేశ్, వేముల రాజు తదితరులు పాల్గొన్నారు.