
విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
జగిత్యాలరూరల్: విద్య, వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి శివారులో మోడల్‌స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెల్లో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా రూ.10 లక్షలతో నిర్మించనున్న వంటగది నిర్మాణానికి భూమిపూజ చేశారు. నూతనంగా నిర్మించిన సైన్స్‌ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యను బలోపేతం చేసేందుకు సర్కార్ బడుల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఎంపీడీవో రమాదేవి, ఎంఈవో గాయత్రి, ఎంపీవో రవిబాబు, డీఈ మిలింద్, ఏఈ రాజమల్లయ్య, నాయకులు రజిత, శేఖర్, దామోదర్, ప్రిన్సిపాల్ సరితదేవి పాల్గొన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి
రాయికల్(జగిత్యాల): కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో గ్రామాలు అభివృద్ధి చెందాయని ఎమ్మె ల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఆలూరు, వీరాపూర్, ధర్మాజీపేట, తాట్లవాయి, కట్కాపూర్, దావన్‌పల్లి, వస్తాపూర్, బోర్నపల్లిలో రూ.1.30 కోట్లతో సీసీరోడ్డు నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని, గెలిచిన తర్వాత గ్రామాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని పేర్కొన్నారు. మండలంలో వైద్యసౌకర్యాలు మెరుగుపర్చేందుకు పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డెప్యూటీ డీఎంహెచ్‌వోలు శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, ఎంపీడీవో చిరంజీవి, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్, మెడికల్ ఆఫీసర్ సతీశ్, విండో చైర్మన్లు ఏనుగు మల్లారెడ్డి, దీటి రాజిరెడ్డి, ఎంపీవో సుష్మ పాల్గొన్నారు.