
డెంగీపై జాగ్రత్తగా ఉండాలి
జగిత్యాల: డెంగీపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుంచి ఐఎంఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతేడాది జిల్లాలో 292 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అందరూ చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్నారని వివరించారు. ఈ ఏడాది డెంగీ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రజలకు సైతం అవగాహన కల్పించాలన్నారు. దోమల నిర్మూలనే లక్ష్యంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్లు ఎన్.శ్రీనివాస్, మలేరియా అధికారి సత్యనారాయణ, ఐఎంఏ సెక్రెటరీ శ్రీనివాస్‌రెడ్డి, ఆరోగ్య విస్తీర్ణాధికారులు శ్రీధర్, రాజేశం, మురళీ, శ్యామ్‌సుందర్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన సేవలతో నమ్మకం కలిగించాలి
పెగడపల్లి(ధర్మపురి): ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం కలిగేలా మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ సూచించారు. శుక్రవారం పెగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందులు, వివిధ రకాల రిజిష్టర్లు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతిలు జరిగేలా అవగాహన కల్పించాలన్నారు. ఆసుపత్రి ద్వారా అందించే సేవలపై సూపర్‌వైజర్స్ వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు. వైద్యాధికారి నరేశ్, సీహెచ్‌వో మహేందర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.