
రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం
మేం అన్నాచెల్లెళ్లం. బీటెక్, ఎంసీఏ పూర్తి చేశాం. వ్యవసాయంపై ఇష్టంతో రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్నాం. మంచి దిగుబడులు సాధిస్తున్నాం. రసాయనాలు లేని ఆహార ఉత్పత్తులు పండించి వాటిని ఆహారంగా వాడుకుంటున్నాం.
– గుర్రాల శశికుమార్, సాహితీ
ఖర్చు లేని పద్ధతులతో లాభం
ఖర్చు లేని సాగు పద్ధతులను ఇప్పటికే ఆచరిస్తున్నాం. మరిన్ని పద్ధతులను తెలుసుకునేందుకు శిక్షణకు వచ్చాను. ఘనామృతం, జీవామృతం తయారీ, ఉపయోగించే విధానం వివరించారు. ఆవు మూత్రం, పేడతో తయారు చేసే పద్ధతులు తెలిపారు.
– బద్దం రాహుల్, ఇబ్రహీంపట్నం
శిక్షణ ఉపయోగంగా ఉంది
ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై ఇచ్చిన శిక్షణ ఉపయోగకరంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి చాలామంది రైతులు హాజరయ్యారు. ఇటీవలి కాలంలో సాగు ఖర్చులు పెరుగుతున్నందున ఎలా తగ్గించుకోవాలనే దానిపై శిక్షణ ఇచ్చారు.
– పాత రమేశ్, తుంగూర్, సారంగాపూర్(మం)

రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం

రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం