
సబ్సిడీ పెంచి.. ధర తగ్గించాలి
రైతులు ఒక్కటి, రెండు పచ్చిరొట్ట విత్తనాల బస్తాలు వాడుతారు. పెరిగిన ధరలు గతేడాదితో పోల్చితే ప్రతి రైతుకు దాదాపు రూ.2 వేల వరకు అదనపు ఖర్చు వస్తోంది. మేం పండించే పంటకు మాత్రం విత్తనాల మాదిరిగా రేట్లు పెరగడం లేదు. ప్రభుత్వం ఆలోచించి సబ్సిడీ పెంచి, రేటు తగ్గించి రైతును ఆదుకోవాలి.
– వేముల విక్రంరెడ్డి, ధర్మపురి
విత్తనాలు తెప్పిస్తున్నాం
జిల్లాకు అవసరమైన మేర పచ్చిరొట్ట విత్తనాలను తెప్పిస్తున్నాం. వరి ఎక్కువగా సాగు చేస్తుండటంతో, ఇతర జిల్లాలతో పోల్చితే పచ్చిరొట్ట విత్తనాలకు డిమాండ్ ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు సింగిల్ విండో కేంద్రాలు, డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా పచ్చిరొట్ట విత్తనాలను రైతులకు అందిస్తున్నాం.
– భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి

సబ్సిడీ పెంచి.. ధర తగ్గించాలి