
2డే క్రికెట్ లీగ్ టోర్నీకి వేళాయే..
● 21 నుంచి జూన్ 5 వరకు లీగ్ మ్యాచ్‌లు ● వేములవాడ, కరీంనగర్ కేంద్రంగా పోటీలు
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో 2డే క్రికెట్ లీగ్ టోర్నీ ప్రారంభం కానుంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) రాష్ట్రస్థాయి టోర్నీల కోసం ముందస్తుగా ఉమ్మడి జిల్లా క్రికెట్ పోటీల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈనేపథ్యంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్– 25 విభాగంలో 2డే క్రికెట్ టోర్నీ పోటీలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలలోని 9 నియోజకవర్గాల నుంటి 6 జట్లను ఎంపిక చేయగా, ఈ నెల 21 నుంచి జూన్ 6 వరకు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మ్యాచ్‌ల వివరాలను జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.ఆగంరావు, ఎన్.మురళీధర్ రావు, ఉపాధ్యక్షుడు కె.మహేందర్‌గౌడ్ వెల్లడించారు. ఈ పోటీల్లో రాణించినవారిని అండర్– 25 ఉమ్మడి కరీంనగర్ జట్టుకు ఎంపిక చేయనున్నారు. జూన్‌లో హెచ్‌సీఏ ఆధ్వర్యంలో జరిగే ఇంటర్ డిస్ట్రిక్ టోర్నమెంట్‌లో కరీంనగర్ అండర్– 25 జట్టు పాల్గొననుంది.
6 జట్లు..16 మ్యాచ్‌లు..
ఉమ్మడి కరీంనగర్‌లోని 13 నియోజకవర్గాల నుంచి 6 జట్లను ఎంపిక చేశారు. 3 వేదికల్లో 16 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ, సెయింట్ అల్ఫోన్స్ పాఠశాల, వేములవాడలోని డాక్టర్ నర్సింగరావు మైదానాల్లో పోటీలు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్‌లు జూన్ 5, 6 తేదీల్లో శాతవాహనలో జరుగనున్నాయి.
మ్యాచ్‌లు ఇవే..
● 21, 22న సిరిసిల్ల, వేములవాడ వర్సెస్ పెద్దపల్లి, మంథని, రామగుండం – శాతవాహన యూనివర్సిటీ.
● 21, 22న జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి వర్సెస్ మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ – సెయింట్ అల్ఫోన్స్ స్కూల్.
● 21, 22న కరీంనగర్ రూరల్, చొప్పదండి వర్సెస్ కరీంనగర్ టౌన్ – వేములవాడ.
● 24, 25న మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ వర్సెస్ సిరిసిల్ల, వేములవాడ – వేములవాడ.
● 24, 25న కరీంనగర్‌టౌన్ వర్సెస్ పెద్దపల్లి, మంథని, రామగుండం– సెయింట్ అల్ఫోన్స్.
● 24, 25న కరీంనగర్ రూరల్, చొప్పదండి వర్సెస్ జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి – శాతవాహన యూనివర్సిటీ.
● 27, 28న సిరిసిల్ల, వేములవాడ వర్సెస్ కరీంనగర్ టౌన్ – వేములవాడ.
● 27, 28న మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ వర్సెస్ కరీంనగర్ రూరల్, చొప్పదండి – సెయింట్ అల్ఫోన్స్.
● 27, 28న పెద్దపల్లి, మంథని, రామగుండం వర్సెస్ జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి – శాతవాహన యూనివర్సిటీ.
● 30, 31న కరీంనగర్ రూరల్, చొప్పదండిి వర్సెస్ సిరిసిల్ల, వేములవాడ – వేములవాడ.
● 30, 31న జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి వర్సెస్ కరీంనగర్‌టౌన్ – శాతవాహన యూనివర్సిటీ.
● 30, 31న పెద్దపల్లి, మంథని, రామగుండం వర్సెస్ మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్– సెయింట్ అల్ఫోన్స్.
● జూన్ 2, 3న సిరిసిల్ల, వేములవాడ వర్సెస్ జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి – వేములవాడ.
● 2, 3న పెద్దపల్లి, మంథని, రామగుండం వర్సెస్ కరీంనగర్ రూరల్, చొప్పదండి – సెయింట్ అల్ఫోన్స్.
● 2, 3న కరీంనగర్ టౌన్ వర్సెస్ మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ – శాతవాహన యూనివర్సిటీ.
● 5, 6న ఫైనల్.. లీగ్‌లో ఎక్కువ స్కోర్ చేసిన రెండు జట్లు – శాతవాహన యూనివర్సిటీ.