
ఆరోపణలు వద్దు.. అభివృద్ధి చేసుకుందాం
ధర్మపురి: పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలిగానీ.. ఎల్‌వోసీలు ఇచ్చి ఒకరినొకరు అవమానపర్చుకోవద్దని డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి అన్నా రు. మూడు రోజులుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విష యం తెల్సిందే. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్‌కు మా జీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఎల్‌ఓసీ ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. దీనిని ఖండిస్తూ సోమవారం శ్రీకాంత్‌రె డ్డి విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్‌కు గతంలో ఆస్పత్రి ఖర్చుల కింద అప్ప టి ప్రభుత్వం ఎల్‌వోసీ ఇచ్చిందని, ఎల్‌వోసీలు, సీఎం రిలీఫ్‌ఫండ్‌లు ప్రభుత్వ నిధులని, కాంగ్రెస్‌వో.. మరో పార్టీవో కావన్నారు. కాంగ్రెస్ పుణ్య మా అని ఎల్‌వోసీ ఇచ్చామని కిందిస్థాయి నాయకులు అనడంలో అర్థం లేదని అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో 32 వేల మందికి రూ.87 కోట్ల వి లువైన ఎల్‌వోసీలు, సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులను అప్పటి మంత్రి ఈశ్వర్ పంపిణీ చేశారని పేర్కొన్నారు. అప్పుడు పార్టీలకతీతంగా ఇచ్చామని పే ర్కొన్నారు. కొప్పుల ఈశర్ చేసిన అభివృద్ధి ధర్మపురిలో ఎక్కడ చూసినా కనిపిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సవాల్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం బురద జల్లడం మానుకోవాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే తీర్పు ఇస్తారని అన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మె ల్యే కార్యాలయానికి ప్రతిఒక్కరూ వస్తారని, బీఆర్‌ఎస్ నాయకులు రావద్దని రూల్స్ ఉంటే కాంగ్రెస్ కా ర్యాలయమని బోర్డు పెట్టుకోవాలని సూచించారు. సంగి సత్తమ్మ మాట్లాడుతూ .. ఎల్‌వోసీ కాంగ్రెస్ పుణ్యమని అనడం బాధగా ఉందన్నారు. నాయకులు సంగి శేఖర్, మాజీ ఎంపీపీ చిట్టిబాబు, అయ్యో రి వేణు, యూనుస్, శేఖర్, అనంతుల లక్ష్మణ్ తదితరలున్నారు.