
లారీ బోల్తా పడి డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు
ధర్మపురి: ప్రమాదవశా త్తు లారీ బోల్తాపడి డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలైన ఘటన మండలంలోని ఆకసాయిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి మంచిర్యాల వైపు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీ ఆకసాయిపల్లె గుట్టమలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివనాగరాజు, క్లీనర్ దుర్గారావు క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసి 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
దుబాయి నుంచి వచ్చిన వారానికే..
● బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
ధర్మపురి: దుబాయి నుంచి వచ్చి వారం రోజులకే బైక్ అదుపుతప్పి కిందపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని దోనూర్‌లో వెలుగుచూసింది. ఎస్సై ఉదయ్‌కుమార్ కథనం ప్రకారం.. రాజారం గ్రామానికి చెందిన నారకట్ల చంద్రయ్య (43) కూతురుకు పెళ్లి చేద్దామని వారంక్రితం దుబాయి నుంచి వచ్చాడు. మంగళవారం దోనూర్‌లో ఉంటున్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. చంద్రయ్య తల రాయికి తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్యకు భార్య ధనలక్ష్మి, కూతురు శ్రీజ, కుమారుడు తేజ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

లారీ బోల్తా పడి డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు