
ఆత్మస్థైర్యం కోలు‘పోతున్నారు’
జగిత్యాలక్రైం: కొంతకాలంగా జిల్లాలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. కారణమేదైనా క్షణికావేశంలో పాణం తీసుకుంటున్నారు. జిల్లాలో 2024లో 217 మంది, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 106 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక స్థితి సరిగా లేక, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, గృహహింస, చదువులో విఫలమవడం, ప్రేమ వైఫల్యం, సెల్‌ఫోన్ కొనివ్వలేదని, డబ్బులివ్వడం లేదని తదితర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఐదు నెలల్లో 106 మంది..
● జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 106 మంది వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.
● బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు కారణం కడుపునొప్పి, అనారోగ్య సమస్యలు అని మాత్రమే పోలీసు రికార్డులకెక్కుతున్నాయి.
● ఆయువు తీసుకుంటున్న వారిలో ఎక్కువగా 15–40 ఏళ్ల వయస్సులోపు వారే ఉంటున్నారు. ఆత్మహత్యలను మానవీయ కోణంలో చూసి ప్రజల్లో స్థైర్యాన్ని నింపాల్సిన అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనబడటం లేదు. స్వచ్ఛంద సంస్థలు, అధికారులు చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది.
● గతంలో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలుండటంతో కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మానసిక వేదనకు గురైతే కుటుంబ పెద్దలు వారిని సముదాయించి పరిష్కారం చూపేవారు.
● ప్రస్తుతం ఒంటరి కుటుంబాల్లో ఏ సమస్య వచ్చినా ఎవరికి వారే పరిష్కరించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే, తమ స్థితికి మించిన కోరికలు ఎక్కువ అవడం, వాటిని తీర్చుకోలే మనోవేదనకు గురువుతున్నారు.
● తమ సామర్థ్యాన్ని మించి అప్పు చేయడం కూడా ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా కనబడుతోంది.
ఒక్క క్షణం మీ కోసం
ఆత్మహత్య చేసుకోవాలనే వారు ఒక్క క్షణం కుటుంబం గురించి ఆలోచించాలి. సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని అన్వేశిస్తూ ముందుకెళ్లాలి. ఒకసారి ఎందులోనైనా ఓడిన తర్వాత ఎప్పుడు ఓడిపోతామనే నిరాశావాదాన్ని వదిలిపెట్టి, ఆశావాదంతో ముందుకు కదలాలి. సమస్యలు ఎప్పుడు రావు కదా, అవి వచ్చినప్పుడు కుంగిపోవద్దు. వాటి నుంచి బయట పడేలా చూసుకోవాలి.
వివిధ కారణాలతో పెరుగుతున్న ఆత్మహత్యలు
జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 106 మంది బలవన్మరణం
‘ఏప్రిల్ 29న మల్యాల మండలం తాటిపల్లికి చెందిన అట్ల రవీందర్‌రెడ్డి (40) పొలం వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు’.
‘బీటెక్ ఫస్టియర్‌లో మార్కులు తక్కువగా వచ్చాయని జగిత్యాల పట్టణం హౌసింగ్‌బోర్డు ప్రాంతానికి చెందిన కన్నవేని సంజనరెడ్డి (20) మే 8న ఉరేసుకుంది’.
‘జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన ప్రసన్నలక్ష్మి (26) అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఏప్రిల్ 24న ఉరేసుకుంది’.
‘జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్‌కు చెందిన జంగ పూజ (20) నీట్‌లో ర్యాంక్ రాదని ఈ నెల 5న ఉరేసుకుంది.’
జగిత్యాల రూరల్ మండలం సోమన్‌పల్లికి చెందిన పొరండ్ల సంతోష్‌రెడ్డి (25) ‘ఏప్రిల్ 28న అప్పుల బాధతో
పురుగుల మందుతాగి చనిపోయాడు’.
‘మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన ఆర్‌ఎంపీ సాంబర్
జగదీశ్ (44) మూడేళ్లుగా తీవ్రమైన మెడనోప్పితో బాధపడుతూ ఏప్రిల్ 25న ఆత్మహత్యకు
పాల్పడ్డాడు’.