
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం తగదు
కోరుట్ల: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం తగదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నా రు. శుక్రవారం కోరుట్ల మండలం మోహన్‌రావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరి పంట కోసి నెల గడుస్తున్నా కొనుగోళ్ల ప్రక్రియ ముగియలేదని అధికారుల పనితీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలకు కొన్ని చోట్ల ధాన్యం మొలకలు వచ్చాయన్నారు. మరో పది రోజుల్లో వర్షాకాలం ప్రా రంభం అవుతుందని ధాన్యం కొనుగోళ్లు చేయకుంటే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అ నంతరం చినమెట్‌పల్లిలో హనుమాన్ ఆలయ ధ్వజస్తంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.