
అంజన్నా మళ్లొస్తాం
● ముగిసిన పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ● కొండగట్టులో కొనసాగుతున్న భక్తుల రద్దీ
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేట శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. కొండపై మూడు రోజులపాటు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శుక్రవారం సైతం భక్తుల రద్దీ కొనసాగింది. ఆంజనేయస్వామి నామస్మరణతో కొండగట్టు ఆలయ పరిసరాలు మార్మోగాయి. జయంతి ఉత్సవాలకు మూడు రోజులపాటు సుమారు రెండున్నర లక్షలకుపైగా భక్తులు తరలివచ్చారు. కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయ అధికారుల సమన్వయంతో వేడుకలు విజయవంతంగా నిర్వహించారు.