
బదిలీలు, పదోన్నతులు చేపట్టండి
జగిత్యాల: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని పీఆర్టీయూ నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నందున విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు ఆనందరావు, రాజు, వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు.
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్ అన్నారు. మంత్రికి వినతిపత్రం అందింశారు. పెండింగ్ డీఏలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లించేలా చూడాలన్నారు. కృష్ణారెడ్డి, విజయ్, యాకూబ్, అశోక్‌రావు పాల్గొన్నారు.
‘డబుల్’ ఇళ్లలో వసతులు కల్పించాలి
నూకపల్లిలోగల డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో వసతులు కల్పించాలని లబ్ధిదారులు మంత్రిని కలిసి విన్నవించారు. విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం ఉందని, మిగిలిపోయిన కొన్ని పనులకు నిధులు కేటాయించాలని కోరారు.