వేసవి శిక్షణ శిబిరాలతో విద్యార్థులకు మేలు
● ముగిసిన శిబిరాలు ● ఇబ్రహీంపట్నంలో 120 మంది విద్యార్థులకు శిక్షణ
ఇబ్రహీంపట్నం : వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎండలో ఆటలు ఆడకుండా బావులు, చెరువుల, కాలువల వైపు వెళ్లకుండా ప్రభుత్వం 6 నుంచి 9 వ తరగతి విద్యార్థులకు ఈ సంవత్సరం వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించింది. ఈ శిబిరాలను ఈ నెల 2 నుంచి 17 వరకు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండలంలోని గోధూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 120 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు నైపుణ్యం గల ఉపాధ్యాయులతో శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు నోట్‌బుక్కులు, పెన్నులు అందించారు. శిక్షణలో యోగా, మెడిటేషన్, వేదిక్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంగ్లిష్ గ్రామర్, చేతి రాతలో శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, సులభంగా లెక్కలు చేసేందుకు షార్ట్‌కట్ మ్యాథ్స్‌ను నేర్పించారు. విద్యార్థులు శిక్షణ పొందడం వలన మేథాశక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఇంగ్లిష్ మాట్లాడడం, మ్యాథ్స్‌లో షార్ట్‌కట్ పద్ధతులు, సైన్స్‌లో మెలకువలు, మెంటల్ ఎబిలిటీ నేర్చుకున్నట్లు పలువురు విద్యార్థులు తెలిపారు.
విద్యార్థులకు ఉపయోగకరంగా శిక్షణ
నైపుణ్యం గల ఉపాధ్యాయులతో శిక్షణనిచ్చాం. విద్యార్థులలో మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఈ వేసవి కాలంలో కొత్తగా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది. ఈ శిబిరాలకు విద్యార్థుల తల్లిదండ్రులు శిక్షణకు పంపిస్తే వివిధ రకాల శిక్షణలు పొంది విద్యార్థుల్లో మంచి విద్యతో పాటు మేథాశక్తి కూడా పెరుగుతుంది.
– మధు, ఎంఈవో, ఇబ్రహీంపట్నం
వేసవి శిక్షణ శిబిరాలతో విద్యార్థులకు మేలు
వేసవి శిక్షణ శిబిరాలతో విద్యార్థులకు మేలు


