సమస్యలు పరిష్కరించండి
జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కోరారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. యావర్‌రోడ్‌ను 60 నుంచి 100 ఫీట్లకు విస్తరించాల్సి ఉందన్నారు. సాగునీటి ఇబ్బందులు లేకుండా కాలువలు మరమ్మతు చేపట్టాలన్నారు. రోళ్లవాగుకు అటవీశాఖ అనుమతులు ఇప్పించి గేట్లు బిగించాలని కోరారు.
డీఎంహెచ్‌వోగా సుజాత
జగిత్యాల: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా సుజాత నియామకం అయ్యారు. ఇక్కడి వైద్యాధికారి శ్రీనివాస్ గుండెపోటుతో మృతిచెందిన విషయం తెల్సిందే. ఆయన స్థానంలో సుజాత బాధ్యతలు స్వీకరించారు. ఆమె కలెక్టర్ సత్యప్రసాద్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
విద్యుత్ బకాయిలు చెల్లించాలి
మల్లాపూర్: గ్రామపంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు చెల్లించాలని ట్రాన్స్‌కో ఏడీఈ అమరేందర్ అన్నారు. వ్యవసాయ, గృహ, వాణిజ్య విద్యుత్ బకాయిలను నేరుగా లేదా ఆన్‌లైన్ ద్వారా చెల్లించి సంస్థ నిర్వహణకు తోడ్పడాలన్నారు. ప్రజలకు మెరుగైన నిరంతర విద్యుత్ సరఫరాకు ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఇన్‌చార్జి ఏఈ సంతోష్, సర్పంచ్ తోట శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మోహన్, కారోబార్ రంజిత్, విద్యుత్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
జీవాల్లో నట్టలు నివారించాలి
రాయికల్: గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేయాలని, తద్వారా వాటి మరణాల రేటు తగ్గించుకోవాలని జిల్లా పశువైద్యాధికారి ప్రకాశ్ అన్నారు. మండలంలోని అల్లీపూర్‌లో జీవాలకు నట్టల నివారణ మందు వేశారు. ప్రభుత్వం నుంచి మంజూరైన మందులతో నట్టలు చనిపోయిన ఆకలి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎంబారి గౌతమి, వెంకట్‌రెడ్డి, పశువైద్యాధికారి నరేశ్‌రెడ్డి, ఉపసర్పంచ్ వినయ్, యాదవ రైతులు మనోజ్, భీమయ్య, ఎల్‌ఎస్‌ఏ శివకుమార్ పాల్గొన్నారు.
ఉత్తమ సహకార సంఘంగా రాయికల్ సొసైటీ
రాయికల్: రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ సేవలందించినందుకు రాయికల్ సహకార సంఘానికి అవార్డు లభించింది. సంఘం ఆధ్వర్యంలో రై తులకు రుణాలు ఇవ్వడంలో.. ఇచ్చిన రుణా లను రికవరీ చేయడంలో.. డిపాజిట్ల సేకరణ లో.. బ్యాంకింగ్ కార్యకలాపాలల్లో సంఘం మె రుగైన ఫలితాలు సాధించింది. ఈ మేరకు సహకార వారోత్సవాల్లో భాగంగా సోమవారం హై దరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా సీ ఈవో రవీందర్ ఉత్తమ అవార్డు అందుకున్నారు.
ఆయిల్ పాం ఆకులు తొలగించొద్దు
జగిత్యాలఅగ్రికల్చర్: ఆయిల్ పాం తోటల్లో మొక్కల ఆకులు తొలగించొద్దని, దిగుబడి తగ్గుతుందని జగిత్యాల నియోజకవర్గ ఉద్యానశాఖాధికారిణి స్వాతి తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్‌లోని ఆయిల్ పాం తోటలను రైతులతో కలిసి సోమవారం పరిశీలించారు. 30 నెలలు దాటిన తోటల్లో పరాగ సంపర్కం కోసం కీటకాలను వదులుతున్నామని తెలిపారు. భూమిలో బోరాన్ లోపం ఉన్నట్లు తెలుస్తోందని, దీని నివారణకు ప్రతి చెట్టుకు 100 గ్రాముల బోరాన్ వేసుకోవాలని సూచించారు. హెచ్‌ఈఓ అనిల్, ఆయిల్ పాం కంపెనీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించండి
సమస్యలు పరిష్కరించండి
సమస్యలు పరిష్కరించండి
సమస్యలు పరిష్కరించండి


