అను‘మతి’లేని ట్రావెల్స్‌ | - | Sakshi
Sakshi News home page

అను‘మతి’లేని ట్రావెల్స్‌

May 20 2025 12:17 AM | Updated on May 20 2025 12:17 AM

అను‘మతి’లేని ట్రావెల్స్‌

అను‘మతి’లేని ట్రావెల్స్‌

జగిత్యాలక్రైం: ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే అదునుగా తీసుకుంటున్న కొంతమంది ట్రావె ల్స్‌, గల్ఫ్‌ ఏజెంట్ల పేరుతో గల్ఫ్‌ పంపిస్తామని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలు రెండేళ్లుగా భారీగా పెరిగాయి. జిల్లాలో సుమా రు 180 ట్రావెల్స్‌ అనధికారికంగా నడుస్తున్నట్లు తె లుస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు విదేశీల్లో ఉపాధి కల్పిస్తామంటూ గల్ఫ్‌ ఏ జెంట్లు ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి ట్రావెల్స్‌కు విమాన టికెట్లు బుకింగ్‌ చేసేందుకే అనుమతి ఉంటుంది. కానీ కొందరు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి వారి పా స్‌పోర్టులు తీసుకుంటున్నారు. ఇంటర్వ్యూలకు పిలి పించి వీసా వచ్చిందని నమ్మిస్తూ రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. కొన్ని ట్రావెల్స్‌లో అనుమతి లేకుండా మనీ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నారు.

18 మందికే లైసెన్స్‌లు

జిల్లాలో గల్ఫ్‌ పంపించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కేవలం సుమారు 18 మంది ఏజెంట్లు మాత్రమే లైసెన్స్‌ ఉంది. మిగిలిన వారు అనుమతి లేకుండా ట్రావెల్స్‌, ఏజెంట్లుగా చలామణి అవుతూ నిరుద్యోగుల నుంచి వీసాల పేరుతో పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు.

లైసెన్స్‌ లేకున్నా ఇంటర్వ్యూలు

గల్ఫ్‌ ఏజెంట్లు, ట్రావెల్స్‌ నిర్వాహకులు లైసెన్స్‌ ఉన్నప్పటికీ ఎస్బీ (స్పెషల్‌ బ్రాంచ్‌) పోలీసులకు సమాచారం అందించి ఇంటర్వ్యూలు నిర్వహించాలి. కానీ కొందరు ఎలాంటి సమాచారం లేకుండానే హోటళ్లు, ఫంక్షన్‌హాల్స్‌, గెస్ట్‌హౌస్‌ల్లో నిర్వహిస్తున్నారు. పాస్‌పోర్టులు తీసుకుని ఏదో ఒక వీసా అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. యూరప్‌లో ఉద్యోగాలు ఉన్నాయంటూ రూ.3 నుంచి రూ.ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నారు.

పెరుగుతున్న గల్ఫ్‌ మోసాలు

ఏజెంట్ల చేతికి చిక్కుతున్న నిరుద్యోగులు

అందినకాడికి దండుకుంటున్న నిర్వాహకులు

‘రాయికల్‌ మండలకేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు జగిత్యాలకు చెందిన లైసెన్స్‌ లేని ఓ ట్రావెల్స్‌ నిర్వాహకులు యూరప్‌ దేశం పంపిస్తామని ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.5 లక్షలు వసూలు చేశారు. వారిని పంపించకుండా మూడు నెలలుగా నేడు.. రేపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు..’

‘జగిత్యాల రూరల్‌ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు గల్ఫ్‌ వెళ్లేందుకు నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌కు చెందిన ఓ వ్యక్తికి రూ.2లక్షలు ఇచ్చాడు. ఆర్నెళ్లు గడుస్తున్నా సదరు యువకుడిని పంపించడం లేదు. ఏజెంట్‌ ఇంటికి వెళ్లి డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడు..’

ఇటీవల జగిత్యాల జంబిగద్దె ప్రాంతంలో ఓ వ్యక్తి ఎలాంటి

అనుమతి లేకుండా ట్రావెల్స్‌ పెట్టి యువతులను రిసెప్షనిస్ట్‌గా నియమించి నిరుద్యోగులకు ఫోన్‌కాల్స్‌ చేయిస్తున్నాడు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో వారిని మభ్యపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి గల్ఫ్‌ వెళ్తారా..? అని అడుగగా సదరు ఎమ్మెల్యే ఎవరికి ఫోన్‌ చేశావని అడగడంతో కంగుతిన్న రిసెప్షనిస్ట్‌ ఫోన్‌ పెట్టేసింది. ఆ ఎమ్మెల్యే విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ నకిలీ ట్రావెల్స్‌ యజమానిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement