
● ఉద్యోగం నుంచి తొలగించారు
డీఎస్సీ 2004లో స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్/ప్రత్యేక అవసరాలు) గా ఎంపికై అక్టోబర్ నుంచి జెడ్పీహెచ్‌ఎస్ కొడిమ్యాలలో విధులు నిర్వర్తించాను. ఏడు నెలల వేతనం కూడా పొందాను. బాలం దుర్గాప్రసాద్ అనే వ్యక్తి పేరిట వచ్చిన తప్పుడు ఫిర్యాదుతో విద్యాశాఖ అధికారులు నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయంపై పూర్తి విచారణ జరిపి నా ఉద్యోగం నాకు ఇప్పించి న్యాయం చేయండి.
– ఎం.లక్ష్మినారాయణ, ఉపాధ్యాయుడు,
కొడిమ్యాల