
బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 18 మంది అర్జీలు సమర్పించారు. ఎస్పీ వారితో మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
స్కూల్ బస్సులకు ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి
కోరుట్ల: ప్రైవేటు స్కూల్ బస్సులకు అన్ని రకాల ధ్రువీకరణపత్రాలు తప్పనిసరి అని జిల్లా రవాణా అధికారి భద్రు నాయక్ అన్నారు. పట్టణంలోని ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం ప్రైవేట్ స్కూల్ యజమానులతో సమావేశమయ్యారు. స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ పర్మిట్, పొల్యూషన్, రిజిస్ట్రేషన్, డ్రైవర్ లైసెన్స్, డ్రైవర్‌కు ఐదేళ్ల అనుభవం తప్పనిసరిగా పేర్కొన్నారు. కోరుట్ల మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, కథలాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల ప్రైవేట్ స్కూల్ యజమానులు పాల్గొన్నారు.
గ్రామీణులకు మెరుగైన వైద్యం
జగిత్యాలరూరల్: గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. నిరుపేదలకు వైద్యం అందించేందుకు ముక్త్ భారత్ అభియాన్ దోహదపడుతుందన్నారు. జబ్బులు గుర్తించి చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. కల్లెడ మెడికల్ ఆఫీసర్ సౌజన్య, పంచాయతీ కార్యదర్శి కిరీటి, కారోబార్ రాజిరెడ్డి, సబ్‌సెంటర్ ఆఫీసర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
జగిత్యాల డీఎస్పీ బదిలీ
జగిత్యాలక్రైం: జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ హైదరాబాద్ ఇంటెలిజెన్సీ డీఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రామగుండం సీసీఎస్‌లో ఏసీపీగా పనిచేస్తున్న వెంకటస్వామిని నియమిస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయండి
జగిత్యాల: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 22 నుంచి 28 వరకు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం రెండుగంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్ష ఉంటుందన్నారు. సీసీ కెమెరాల నిఘా నేతృత్వంలో పరీక్షలు జరుగుతాయని, విద్యుత్, వైద్యశాఖ ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు నడపాలని సూచించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియెట్ నోడల్ అధికారి నారాయణ, పోలీసు, విద్యుత్, వైద్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం

బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం

బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం