
● ఆదేశాలు పట్టడం లేదు.
మా గ్రామ శివారులోని సర్వే నంబర్ 438/ఆ/4లోని రెండెకరాల సొంత భూమిని అప్పటి తహసీల్దార్ చిందం శ్రీనివాస్ తప్పుడు పత్రాలను సృష్టించి ఎల్మల కొమురయ్య తండ్రి ఒక్కపొద్దు పేరిట మార్పిడి చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరితే ఇవ్వడానికి నిరాకరించారు. దీనిపై అప్పటి కలెక్టర్, హైకోర్టు, సీఎం కార్యాలయాన్ని ఆశ్రయించాను. హైకోర్టు, సీఎం కార్యాలయం అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఏళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. అధికారులను సంప్రదిస్తే తమ వద్ద పత్రాలు లేవంటున్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న సారంగాపూర్ తహసీల్దార్ కార్యాలయం అధికారులపై చర్యలు తీసుకోండి.
– బాస మహేశ్, రేచపల్లి, సారంగాపూర్