
అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోండి
గ్రామంలోని సర్వే నంబర్ 22లో గల 6గుంటల ప్రభుత్వ స్థలంలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. పిల్లర్ల దశ వరకు నిర్మాణం పూర్తయింది. దానికి 3–96నంబర్ కేటాయించారు. అయితే అదే గ్రామానికి చెందిన భోగ సత్తన్న ఆ భవనాన్ని కూల్చివేసి అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నాడు. పంచాయతీ కార్యదర్శి, డీపీవోతో ఫిర్యాదు చేశాం. 24గంటల్లో కూల్చివేయాలని నోటీసు జారీచేసినా.. సదరు వ్యక్తి స్పందించడం లేదు. విచారణ జరిపి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి.
– నర్సింహులపల్లె, బీర్‌పూర్
అక్రమ భూమార్పిడిని రద్దు చేయండి
మా తాత కోల గంగారాం పేరిట రాయికల్ మండలం అల్లీపూర్ రెవెన్యూ పరిధిలో 1120(అ)గల సర్వే నంబర్‌లోని 1.3 ఎకరాల భూమిని దుగ్గిల్ల కొమురయ్య పేరిట అక్రమంగా మార్పిడి చేయించుకున్నాడు. ఆ భూమిపై 2016 నుంచి ఏటా పంట రుణం పొందుతున్నాం. 2023లో రుణమాఫీ కూడా పొందాం. సాక్షి సంతకం పెట్టాలంటూ మా తాత గంగారాంను తీసుకెళ్లిన రొడ్డ బక్కయ్య 2020లోనే దుగ్గిల్ల కొమురయ్య పేరిట భూమిని మార్పిడి చేయించినట్లు ఇటీవలే తెలిసింది. రికార్డులు, మోకాపై విచారణ జరిపి ఆ భూ మార్పిడిని రద్దు చేసి న్యాయం చేయండి.
– కోల వంశీకుమార్, అయోధ్య, రాయికల్

అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోండి