
● ఇష్టానుసారంగా బోర్ల తవ్వకాలు ● భూగర్భజలాలపై తీవ్ర ప్ర
జగిత్యాల: జిల్లాలో బోరు బావుల తవ్వకాలు ఇష్టానుసారంగా పెరిగిపోతున్నాయి. అనుమతి లేకుండానే ఎవరికి వారు ఇష్టానుసారంగా తవ్వేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. బోర్ల తవ్వకాలతో భూగర్భజలాలపై ప్రభావం చూపుతోంది. గృహ అవసరాలు, వ్యవసాయానికి ఇష్టానుసారంగా బోర్లు తవ్వుతున్నారు. వ్యవసాయానికి అయినా.. గృహాల కోసమైనా అనుమతి తప్పనిసరి. కాని కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా బోర్లు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రోజుకు 50కు పైగానే బోర్లు వేయిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో అయితే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
● బోరుబావులు తవ్వాలంటే వాల్టా చట్టం ప్రకారం ముందస్తుగా రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
● పంటల సాగుకు అయితే అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అనుమతి జారీ చేస్తారు.
● ఒక బోరు బావి వద్ద కనీసం 100 మీటర్ల దూరం ఉండాలన్న నిబంధన ఉంది.
● ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎక్కడబడితే అక్కడ బోర్లు వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
● గృహ అవసరాలకు వేసుకుంటే గతంలో కొన్ని నిబంధనలు ఉండేవి. వాటిలో నిబంధనలు సడలించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
● ఆధారం
● వాస్తవానికి జగిత్యాలలో నీటి వనరులు అధికం. ఎస్సారెస్పీ కాలువ ద్వారా పొలాలకు నీరు చేరుతుంది.
● అయితే కొందరు రైతులు పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ బావులు తవ్వుతున్నారు.
● మరికొందరు బోర్లు వేస్తున్నారు. బోర్ల తవ్వకం మొదలయ్యాక పంటల సాగు విస్తీర్ణం అధికం కావడం.. నీటి వినియోగం పెరుగుతోంది.
పాటించని నీటి పొదుపు
ప్రతి ఒక్కరూ నీటి పొదుపునకు చర్యలు పాటించాల్సి ఉండగా ఎక్కడా మచ్చుకు కన్పించడం లేదు.
● రైతులు ఎక్కువగా ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి.
● నీటి నిలువ ఉండటానికి కందకాలు, చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలి.
● ఇవి ఎక్కడా మచ్చుకై నా కన్పించడం లేదు.
● వ్యవసాయ క్షేత్రాల వద్ద నీటి కుంటలను ఏర్పాటు చేస్తే వృథా కాకుండా ఉంటుంది.
బోరు వేస్తున్న ఓ ఇంటి యజమాని
పరిశీలన
ఎక్కడ?
అనుమతి తప్పనిసరి
బోరుబావులు తవ్వుకునే వారు తప్పనిసరిగా అనుమతులు పొందాలి. అలాగే బోరు వాహనాల నిర్వాహకులకు రిజిస్ట్రేషన్ ఉండాలి. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా బోర్లు వేస్తే ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తాం. బోరు బావి కోసం దరఖాస్తు చేసుకుంటే నీటి పరిస్థితిని పరిశీలించి అనుమతి ఇస్తాం.
– జి.నాగరాజు, భూగర్భజల వనరుల
శాఖ అధికారి
వాల్టా చట్టం ప్రకారం బోరు బావుల కోసం తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్న అనంతరం జియాలజిస్ట్‌లు నీటి లభ్యతను పరిశీలించి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
ఆ తర్వాతే బోరు వేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడబడితే అక్కడ బోర్లు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
బోర్లు వేసేవారు కచ్చితంగా ఆర్టీఏ ఆఫీసుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
జిల్లాలో ప్రస్తుతం 17 వరకు వాహనాలకు అనుమతి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఒక వేళ అనుమతి లేకుంటే అధికారులు రూ.లక్ష జరిమానా వేసే అవకాశం ఉంది.