
యూనిఫాం.. ఉపాధి
● మహిళా సంఘాల చేతికి కుట్టు పని ● జిల్లాలో 667 స్కూళ్లు.. 47,963 మంది విద్యార్థులు ● ఒక్కొక్కరికి రెండు జతల దుస్తులు ● 1,144 మంది మహిళా సభ్యులకు లబ్ధి
జగిత్యాలరూరల్: మహిళా సంఘాల్లోని సభ్యులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వారికి నిత్యం పని ఉండేలా ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా అందిచే యూనిఫాంల కుట్టు పనిని మహిళ సంఘాలకు అప్పగించింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యను ఇప్పటికే సేకరించారు. వారి సంఖ్యకు అనుగుణంగా ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున కుట్టి ఇచ్చే బాధ్యతను తీసుకున్నారు.
667 పాఠశాలలు.. 47,963 మంది విద్యార్థులు
జిల్లాలో 667 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 47,963 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి రెండు జతల దుస్తుల చొప్పున మహిళా సంఘం సభ్యులు కుడుతున్నారు. గతంలో కొలతలు లేకుండా కుట్టడంతో విద్యార్థులకు సరిపోయేవి కావు. కానీ ప్రస్తుతం విద్యార్థుల కొలతలు తీసుకుని ఒక్కొక్కరికి రెండు జతల దుస్తులు కుడుతున్నారు. రెండు జతల దుస్తులు కుడితే మహిళలకు రూ.75 చొప్పున చెల్లించనున్నారు. అంగన్‌వాడీ పిల్లలకు రూ.80, వసతి గృహ విద్యార్థులకు రూ.80 నుంచి రూ.100 చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
1144 మంది మహిళలకు ఉపాధి
జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1144 మంది మహిళలు దుస్తులు కుట్టేలా శిక్షణ పొందారు. వారు ప్రస్తుతం పాఠశాలల వారీగా విద్యార్థులకు దుస్తులు కుట్టడంలో నిమగ్నమయ్యారు. వీరు ప్రతిరోజు సుమారు 4,121 డ్రెస్‌లు కుట్టే అవకాశం ఉంటుంది. పాఠశాల ప్రారంభం నాటికి ప్రతి వి ద్యా ర్థికి యూనిఫాం అందేలా చర్యలు చేపడుతున్నారు.
జూన్ వరకు దుస్తులు
జిల్లాలో మహిళా సంఘాల సభ్యులతో విద్యార్థులకు యూ నిఫాంలు కుట్టిస్తున్నాం. ప్రతి విద్యార్థికి రెండు జతల యూని ఫాంలను కుట్టిచ్చి.. జూన్ మొ దటి వారంలో అందించేలా ని ర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమం మహిళాసంఘ సభ్యులకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. – రఘువరణ్, డీఆర్డీఏ పీడీ
జిల్లాలో మండల సమైక్యలు 18
గ్రామ సమైక్యలు 565
స్వశక్తి సంఘాలు 14,957
మహిళా సంఘాల్లో సభ్యులు 1,72,801

యూనిఫాం.. ఉపాధి