
ముఖ్యమంత్రిపై అసత్య ప్రచారం మానుకోవాలి
● విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి: కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అసత్య ప్రచారం మానుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హితవు పలికారు. శుక్రవారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అగౌరవపరిచిందని, మళ్లికార్జున ఖర్గే పేరుకే అధ్యక్షుడని, ఆయనకు అధికారం లేదని కాంగ్రెస్‌పై కొప్పుల తన అక్కసు వెల్లబోస్తూ మాట్లాడడం సరికాదన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి చేవేళ్ల వరకు వెళ్లే భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు అంబేడ్కర్ పేరు పెడితే ఆ పేరును తొలగించి మేడిగడ్డ అని పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. శ్రీమీడియా సాక్షిగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నీ చేయి పట్టుకొని పక్కకు నెట్టేసినప్పటికీ దానిపై స్పందించకపోవడం సిగ్గుచేటని, ఇన్ని అవమానాలతో బతుకుతున్న నీకు ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్‌ను, ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదుశ్రీ అని అన్నారు. పదేళ్లు మంత్రిగా ఉండి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని, 15 నెలల కాలంలో తాను చేపడుతున్న అభివృద్ధిపై ప్రజల ముందుకు వెళ్దామని సవాల్ విసిరారు. సమావేశంలో నాయకులు ఎస్.దినేశ్, వేములు రాజు, చిలుముల లక్ష్మణ్, సీపతి సత్యనారాయణ, సుముఖ్, శ్రీనివాస్ తదితరులున్నారు.