
ప్రతీ జిల్లాలో రైతువిజ్ఞాన కేంద్రం
జగిత్యాలఅగ్రికల్చర్: కృషి విజ్ఞాన కేంద్రాలు, డాట్ సెంటర్లు లేని అన్నిజిల్లాల్లో రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జానయ్య తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో గురువారం శ్రీరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలుశ్రీ కార్యక్రమం నిర్వహించారు. జానయ్య ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 జిల్లాల్లో డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయన్నారు. మిగతా జిల్లాల్లో రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక్కో కేంద్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతీజిల్లాలో 50 ఎకరాలు అందుబాటులో ఉన్నచోట రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో లేదని, వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేక రైతు కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులతో పంటలపై అనేకరకాల పురుగులు, తెగుళ్లు దాడి చేస్తున్నాయన్నారు. వాటి నివారణకు శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేయాలని కోరారు. ఆర్‌ఎంపీల మాదిరిగా గ్రామాల్లో ఫార్మర్స్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం తెలంగాణ సీడ్ సంస్థ రూపొందించిన శ్రీమన సంస్థ– మన విత్తనంశ్రీ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ శ్రీలత, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ సైదానాయక్, జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖాధికారులు భాస్కర్, శ్యాంప్రసాద్, రైతు నాయకులు రవీందర్‌రెడ్డి, నారాయణరెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయ వర్శిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ జానయ్య