
కొండగట్టులో గిరిప్రదక్షిణ
ఘనంగా శ్రీలక్ష్మీనృసింహస్వామి కల్యాణం
పెగడపల్లి: మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి జయంతి, కల్యాణ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులకు అర్చకులు గుండి వినయ్‌శర్మ కల్యాణ తంతును శాస్త్రోపేతంగా జరిపించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేవారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రామచంద్రం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మల్యాల: పౌర్ణమి సందర్భంగా కొండగట్టు గిరి ప్రదక్షిణలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. చిలుకూరి బాలాజీ అర్చకులు గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఉదయం 6గంటల నుంచి దిగువ కొండగట్టు రోడ్డు, ఘాట్‌రోడ్డు వెంట ప్రదక్షిణ చేశారు. సుమారు ఆరు కిలోమీటర్లు ఉన్న వందలాదిమంది భక్తులు జై శ్రీరాం, జైహనుమాన్ అంటూ నామస్మరణ చేశారు.

కొండగట్టులో గిరిప్రదక్షిణ