
కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు
ఇబ్రహీంపట్నం/మల్లాపూర్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కొనుగోలు చేయడం లేదా..? నిల్వలు ఎందుకున్నాయి..? అని ప్రశ్నించారు. ధాన్యం నిల్వ ఉంచకుండా లారీల్లో ఎప్పటికప్పుడు పంపించాలన్నారు. కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మల్లాపూర్ మండలం సాతారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూ చించారు. కేంద్రాల్లో నీటి సదుపాయం, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, డీఎం జితేందర్, తహసీల్దార్లు వీర్‌సింగ్, ప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్లు శ్రీనివాస్, ప్రసాద్, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, వెంకట్ పాల్గొన్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
మెట్‌పల్లి: పట్టణంలోని ఆరపేటలో కేందాన్ని సందర్శించారు. అకాల వర్షాలు కురిసే అవకాశమున్నందున ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
కలెక్టర్ సత్యప్రసాద్