
జగిత్యాల: జగిత్యాల.. జిల్లాకేంద్రం. ఆపై గ్రేడ్–1 మున్స
సాక్షి: ఎండలు ముదురుతున్నాయి. బల్దియాలో నీటి ఎద్దడి ఉందా..? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కమిషనర్: ఇప్పటికై నా తాగునీటి సమస్య లేదు. జిల్లాకేంద్రానికి తాగునీరు అందించే ధర్మసముద్రంలో రెండు నెలలకు సరిపడా నీరు ఉంది. ప్రస్తుతానికి మిషన్ భగీరథ నుంచి వచ్చే నీటినే సరఫరా చేస్తున్నాం. తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
సాక్షి: లీకేజీ సమస్య ఎక్కువగా ఉంది? పాత పెపులైన్లను ఎలా సరిచేస్తున్నారు?
కమిషనర్: జిల్లా కేంద్రంలో పాత పైప్‌లైన్లు ఉన్నాయి. వాటిద్వారా కొన్నిచోట్ల లీకేజీ సమస్యలున్నాయి. వాటన్నింటినీ గుర్తించాం. ఇప్పటికే చాలావరకు మరమ్మతు చేయించాం. మిగిలిన చోట్ల కూడా చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం.
సాక్షి: రంగుమారిన నీరు సరఫరా అవుతున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయి?
కమిషనర్: అలాంటిదేమీ లేదు. ఏదైనా వర్క్స్ జరిగినప్పుడు మున్సిపల్ నీరు మిక్స్ అయితే వచ్చే అవకాశాలుంటాయి. వాటిని కూడా గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు చేపడతాం.
సాక్షి: రోజుకు ఎన్ని లీటర్ల నీరు సరఫరా చేస్తున్నారు. ప్రజలకు సరిపోతున్నాయా?
కమిషనర్: జిల్లాకేంద్రంలోని జనాభాకు ప్రతిరోజూ 18.1 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ ఫర్‌డే) అవసరం. ప్రస్తుతం కోటి 80 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం. ప్రజలకు సరిపోతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేవు.
సాక్షి: కొత్త నల్లా కనెక్షన్లు ఇస్తున్నారా? ఇప్పుడెన్ని ఉన్నాయి?
కమిషనర్: అమృత్ పథకం కింద కొత్త కనెక్షన్లు ఇస్తున్నాం. దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికి రూపాయికే కనెక్షన్ ఇస్తున్నాం. మిగతా వారికి రూ.200కు కనెక్షన్ ఇస్తున్నాం. దరఖాస్తు చేసుకున్నవారికి ఇస్తాం.
సాక్షి: శివారు ప్రాంతాలకు నీరు రావడం లేదని ఆరోపణలున్నాయి
కమిషనర్: జిల్లాలో ఇటీవల విలీనమైన 48వార్డులో కొంత సమస్య ఉంది. అయినప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటిని పంపించేలా చూస్తున్నాం. ఎంత కష్టమైనా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం.
సాక్షి: ట్యాంకర్లు ఉన్నాయా..? అత్యవసర పరిస్థితుల్లో సరఫరా చేస్తారా..?
కమిషనర్: మున్సిపాలిటీలో 4 ట్యాంకర్లు ఉన్నాయి. ఎవరికై నా అవసరం పడితే ఫోన్ చేస్తే పంపిస్తున్నాం. వేసవిలో ఎవరికై నా నీటి సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురావాలి.
సాక్షి: కొన్ని ప్రాంతాల్లో రోజు విడిచి రోజు వస్తోందని అంటున్నారు..?
కమిషనర్: కొన్నిచోట్ల ఇటీవల కొత్త లైన్లు వేశాం. సాయినగర్ కాలనీలో రోజువిడిచి రోజు నీరు సరఫరా చేస్తున్నాం. కొత్త పైప్‌లైన్‌తో కొంత ఇబ్బంది ఉంది. వారికి కూడా ఇబ్బ ంది కలగకుండా పంపిణీ చేస్తాం.
సాక్షి: నిజామాబాద్ రోడ్‌లో పైప్‌లు పగిలి నీరంతా వృథా అవుతోంది..?
కమిషనర్: ప్రధాన రహదారుల్లో కొంతమేర లీకేజీలు అవుతున్నాయి. అక్కడ మరమ్మతు చేయించాలన్నా.. ఇబ్బందికరంగా ఉండేది. కొన్నిచోట్ల చేశాం. కొత్త పైప్‌లైన్ వేసవి చర్యలు తీసుకుంటాం.
సాక్షి: ధర్మసముద్రంలో నీటి మట్టం తగ్గుతోంది?
కమిషనర్: ప్రస్తుతం బల్దియా ప్రజలకు మిషన్ భగీరథ నీటినే సరఫరా చేస్తున్నాం. మిషన్ భగీరథ నీరు రాని పక్షంలోనే ధర్మసముద్రం నుంచి నీటిని ఫిల్టర్ చేసి ప్రజలకు సరఫరా చేస్తాం. అందులోని నీరు సుమారు 15 రోజులకు సరిపడా ఉంది. ఇప్పటికిప్పుడైతే బల్దియాకు నీటి కొరత లేదు.

జగిత్యాల: జగిత్యాల.. జిల్లాకేంద్రం. ఆపై గ్రేడ్–1 మున్స