
పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి
అంత్యక్రియలకు వచ్చి అనంతలోకాలకు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని చిన్నలింగాపూర్‌లో పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. కామారెడ్డి జిల్లాకు చెందిన వలిదాసు కృష్ణయ్య–లలిత దంపతులుకు ఇద్దరు కూతుళ్లు స్నేహాన్షి(4), శ్రీజ(2). తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్‌లో బంధువు సంవత్సరీకం ఉండగా, మరో బంధువు సోమవారం మృతిచెందారు. ఈ రెండు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు లలిత తన ఇద్దరు పిల్లలతో చిన్నలింగాపూర్‌లోని తలి గారింటికి వచ్చింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పెద్ద కూతురు స్నేహాన్షి ఆడుకుంటూ ఇంటి బయటకు వెళ్లగా పాముకరిచింది. పాపను గమనించే సరికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు. పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
మానకొండూర్: మండలంలోని పచ్చునూర్ గ్రామ శివారులో సోమవారం అనుమానాస్పదంగా కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆంజనేయులు(50) అనే వ్యక్తి కొద్ది నెలల నుంచి గ్రామానికి చెందిన బత్తుల అజయ్ మేసీ్త్ర వద్ద కూలీ పనిచేస్తున్నాడు. సోమవారం గ్రామ శివారులోని ఓ వ్యక్తికి చెందిన పొలం సమీపంలో మృతదేహం కుళ్లి పోయిందని గ్రామ కారోబార్‌కు తెలుపగా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని సీఐ సంజీవ్ పరిశీలించారు. మృతుకి గల కారణాలు తెలియనందున అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.