
హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు అంకురార్పణ
మల్యాల: హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు సోమవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. ఆలయ ప్రధాన ద్వారం, వైజంక్షన్ వద్దగల స్వాగత తోరణం, ఆలయ పరిసరాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. స్వామివారి ఉత్సవమూర్తిని దీక్ష విరమణ మంటపానికి తీసుకెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం యాగశాల శుద్ధి పుణ్యహవచనం, అంకురార్పణ, అఖండ ద్వీపస్థాపన చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు కపీందర్, ప్రధాన అర్చకులు జితేంద్ర స్వామి, రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి, ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సునీల్‌కుమార్, హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు.