
భారత్ ఆర్మీకి సంపూర్ణ మద్దతు
జగిత్యాల: భారత్ ఆర్మీకి కాంగ్రెస్ పక్షాన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెడికల్ కళాశాల గెస్ట్‌హౌస్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారని పేర్కొన్నారు. మెడికల్, నర్సింగ్ కళాశాల సమస్యలపై సమీక్షిస్తారని, ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలిస్తారని వివరించారు. 30ఏళ్లుగా ఎస్సీల వర్గీకరణ లేక మాదిగలు, ఉప కులాలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గయ్య పాల్గొన్నారు.
పెగడపల్లిలో వడగండ్ల వాన
● నేల రాలిన మామిడి
పెగడపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం గాలిదుమారంతోపాటు వడగండ్ల వర్షం కురిసింది. మామిడి రైతులకు నష్టాలు చవిచూపింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కోతకొచ్చి న వరిపైరు నేలకొరిగింది. నష్టపోయిన మామిడితోటలను పరిశీలించి పరిహారం అందేలా చూడాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
జర్నలిస్టుల సంఘీభావ ర్యాలీ
జగిత్యాలటౌన్: భారత సైనికుల వీరోచిత పోరాటానికి సంఘీభావంగా శనివారం జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో జర్నలిస్టులు ర్యాలీ చేపట్టారు. భారతదేశ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు పాక్ అనేక కుట్రలు చేసిందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుందన్నారు. కార్యక్రమంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియీ జర్నలిస్టులు పాల్గొన్నారు.

భారత్ ఆర్మీకి సంపూర్ణ మద్దతు

భారత్ ఆర్మీకి సంపూర్ణ మద్దతు