
అంజన్న సన్నిధిలో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ పూజలు
మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో కలెక్టర్ బి.సత్యప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎస్పీ అశోక్‌కుమార్ బుధవారం ప్రత్యేక పూజ లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. స్వామి వారి తీర్థ, ప్రసాదాలు అందజేసి, ఆశీర్వదించారు.
సకాలంలో టీకా వేయించాలి
వెల్గటూర్: పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంచేందుకు, వ్యాధుల బారిన పడకుండా సకాలంలో టీకాలు వేయించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో నీలారపు శ్రీనివాస్ అన్నారు. బుధవారం వెల్గటూర్ గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న టీకాలు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆరోగ్య కేంద్రంలో రోజువారీ ఓపీ, డెలివరీలు, మందుల నిల్వలను తనిఖీ చేశారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న టీబీపై అవగాహన కార్యక్రమ వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట హెల్త్ అసిస్టెంట్ జగన్నాథం, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
నేల ఆరోగ్యాన్ని కాపాడితేనే పంటల్లో దిగుబడి
జగిత్యాలఅగ్రికల్చర్: భూమి ఆరోగ్యాన్ని కాపాడితేనే పంటల్లో దిగుబడులు సాధ్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు జి. వేణుగోపాల్, శ్రీనివాస్ నాయక్ అన్నారు. రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తల కార్యక్రమంలో భాగంగా బుధవారం జగిత్యాల రూరల్ మండలంలోని హైదర్‌పల్లిలో రైతులతో సమావేశమయ్యారు. నేలను సారవంతం చేసేందుకు కోళ్ల ఎరువు, పశువుల ఎరువు, జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట ఎరువులు వాడాలని సూచించారు. ఈ సందర్భంగా పంటలకు సంబంధించిన బ్రోచర్‌ను రైతులకు అందించారు.
సమ్మెను జయప్రదం చేయాలి
కోరుట్ల: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. బుధవారం పట్టణంలో సమ్మె పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమేశ్, నర్సయ్య, ఇస్తారు, రాజు, హమాలీ సంఘ నాయకులు పాల్గొన్నారు.

అంజన్న సన్నిధిలో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ పూజలు

అంజన్న సన్నిధిలో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ పూజలు

అంజన్న సన్నిధిలో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ పూజలు