
ఒకరిపై ఒకరు ఉపాధ్యాయుల దాడి
● నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ఎంఈవోకు గాయం
ధర్మపురి: విద్యార్థులకు వి ద్యాబుద్ధులు నేర్పించాల్సి న ఉపాధ్యాయుడు విద్యార్థులందరూ చూస్తుండగా మరో ఉపాధ్యాయుడిపై దాడి చేయగా ఇద్దరికి నచ్చ జెప్పడానికి వచ్చిన మండ ల విద్యాధికారి చేతికి గాయమైన ఘటన దోనూ ర్ ప్రభుత్వ పాఠశాలలో కలకలం రేపింది. పోలీ సులు, బాధిత ఉపాధ్యాయుడు తెలిపిన వివరాలు.. దోనూర్‌లో జెడ్పీహెచ్‌ఎస్, ఎంపీపీఎస్ పాఠశాలలున్నాయి. జెడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవా రం నిర్వహించిన పీటీఏ సమావేశానికి మండల విద్యాధికారి సీతామహాలక్ష్మి ముఖ్య అథితిగా, రెండు పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు హాజరయ్యారు. స మావేశంలో రానున్న రోజుల్లో పాఠశాలల బలో పేతం, నాణ్యమైన విద్యాబోధన కోసం తీసుకో వాల్సిన జాగ్రత్తలు వివరించారు. సమావేశం అ నంతరం పాఠశాల ఆవరణలో కొందరు ఉపాధ్యాయులు మాట్లాడుకుంటుండగా, జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ఉపాధ్యాయుడు గాడిపెల్లి మహే శ్ ఎంపీపీఎస్‌కు చెందిన కాశెట్టి రమేశ్‌పై దాడి చేశాడు. అక్కడే ఎంఈవో సీతామహాలక్ష్మి ఇరువురికి నచ్చజెప్పడానికి ప్రయత్నించగా ఆమెను మహేశ్ నెట్టేయడంతో చేతికి గాయమైంది. అంతే కాకండా అసభ్య పదజాలంతో దూషించాడు. కాగా, మహేశ్‌పై గతంలో అనేక ఆరోపణలున్నాయని, అతడి తీరుపై జిల్లా విద్యాశాఖకు తెలిపినట్లు ఎంఈవో పేర్కొన్నారు. పాత కక్షలను మ నసులో పెట్టుకొని రమేశ్‌పై మహేశ్ దాడికి పా ల్పడినట్లు పేర్కొన్నారు. ఎంఈవో, బాధిత ఉపాధ్యాయుడి ఫిర్యాదు మహేశ్‌పై కేసు నమోదు చేశారు అలాగే మహేశ్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో రాము ఉత్తర్వులు జారీ చేశారు.