
భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లు పెడితే చర్యలు
● ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: ప్రజలకు ఇబ్బంది కలిగించేలా.. కాలుష్యం వెదజల్లేలా ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లు వాడితే చర్యలు తప్పవని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా స్వాధీనం చేసుకున్న బుల్లెట్ వాహనాలకు అమర్చిన 130 సైలెన్సర్లను గురువారం రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్రవాహనాలకు సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. శబ్దం చేసే సైలెన్సర్లను వాడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేస్తామని, డ్రైవింగ్ లైసెన్సును కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. డీఎస్పీ రఘుచందర్, టౌన్ సీఐ వేణుగోపాల్, ఐటీ కోర్ సీఐ రఫీక్ ఖాన్, ట్రాఫిక్ ఎస్సై మల్లేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
నృసింహుని జయంతికి ఏర్పాట్లు
సారంగాపూర్: బీర్‌పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈనెల 11న నిర్వహించే జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వొద్ధిపర్తి పెద్ద సంతోష్, అర్చకులు చిన్న సంతోష్, మధుకుమార్ తెలిపారు.