
● జగిత్యాల–నిజామాబాద్ రహదారిపై నిలిచిన రాకపోకలు ● అధిక
జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతోందని పేర్కొంటూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. జగిత్యాల–నిజామాబాద్ రహదారిపై బైఠాయించిన నిరసన తెలిపారు. అకాలవర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని తడిసిన ధాన్యంతోపాటు మార్కెట్‌లో ఉన్న ధాన్యాన్ని త్వరగా తూకం వేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
కాంగ్రెస్ పాలనలో రైతుల అరిగోస
కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. మార్కెట్ ముందు ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. నెల రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి ఎదురుచూస్తున్నారని, కనికరం లేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి యుద్ధప్రతిపాదికన కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు.

● జగిత్యాల–నిజామాబాద్ రహదారిపై నిలిచిన రాకపోకలు ● అధిక