
సజావుగా ధాన్యం కొనుగోళ్లు
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాలరూరల్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం జగిత్యాలరూరల్ మండలం పొలాస, బాలపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఎంట్రీ చేయాలని నిర్వాహకులకు సూచించారు. కేంద్రాలకు వచ్చే ధాన్యం 17 తేమ శాతం రాగానే తూకం వేసి సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం రవాణాలో వాహనాల కొరత, హమాలీల సమ స్య రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట ఆర్డీవో మధుసూదన్, జగిత్యాల రూ రల్ తహసీల్దార్ శ్రీనివాస్, అధికారులు ఉన్నారు.