
ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి
ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి పాకిస్తాన్‌కు భారత్ సైన్యం తీవ్రమైన హెచ్చరిక చేసింది. ఈ చర్య మనదేశ పౌరులకు భరోసా కల్పించింది. లౌకిక దేశమని, ప్రజలందరూ సమానమేనని చాటిచెప్పింది. ఉగ్రవాద ప్రేరేపిత చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ మరోమారు భారత సత్తా చాటడానికి సిద్ధమని సంకేతం ఇచ్చింది.
– కొమురోజు శ్రీనివాస్, ఉపాధ్యాయుడు, మంథని
సైన్యానికి అండగా నిలుద్దాం
పహల్గాం దాడులకు వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూరం చేపట్టిన భా రత సైన్యం.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మనదేశ ప్రజలంతా గర్వపడాల్సిన రోజు ఇది. టెర్రరిస్టులు మరోసారి మనదేశంపై దాడిచేస్తే ఎలా ఉంటుందోననే భయాన్ని చూపించారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా దాడులు చేసిన భారత సైన్యానికి అందరం అండగా నిలవాలి.
–బెజ్జంకి డిగంబర్, విద్యార్థి నాయకుడు, మంథని

ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి