
‘పోషణ్ అభియాన్’లో జిల్లా ప్రథమస్థానం
జగిత్యాల: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం పోషణ్ అభియాన్ పథకంలో భాగంగా మధ్యాహ్న భోజనం అమలులో జిల్లాకు ప్రథమస్థానం లభించింది. శుభ్రమైన ఆహారం అందించడం, నాణ్యమైన భోజనం పెట్టడం ద్వారా అత్యధిక విద్యార్థులు భోజనం చేస్తున్నారు. ఇలా 63.5శాతంతో జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. వంటగదులు పూర్తి కావడం, హెల్త్‌క్యాంప్‌లు నిర్వహించడం, గార్డెన్స్ ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలు పోషణ్‌అభియాన్‌లో చేపడుతున్నారు. కరీంనగర్ 8, రాజన్న సిరిసిల్ల 12, పెద్దపల్లి 16వ స్థానాల్లో నిలిచాయి. డీఈవో రాము, ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ సత్యప్రసాద్ అభినందించారు.
భూములకు హద్దులు ఏర్పాటు చేస్తాం
సారంగాపూర్: భూ భారతి కార్యక్రమంలో భాగంగా రైతుకు ఎంత భూమి ఉందో తెలుసుకుని వాటికి రైతుల సమక్షంలోనే హద్దులు నిర్ణయిస్తామని, ఆ భూమికి మ్యాప్ అందిస్తామని అదనపు కలెక్టర్ బీఎస్. లత అన్నారు. బీర్‌పూర్ మండలం కోమన్‌పల్లిలో భూ సర్వేపై అవగాహన కల్పించారు. కోమన్‌పల్లి పునరావాస గ్రామం కావడంతో ఇక్కడి భూములకు ఇప్పటి వరకు మ్యాపులు లేవన్నారు. భూ భారతి కింద కోమన్‌పల్లిని జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, గ్రామంలోని 624 ఎకరాల విస్తీర్ణం ఉన్న భూమిని సర్వే చేసి, రైతుల సమక్షంలో హద్దులు ఏర్పాటు చేస్తామని వివరించారు. డ్రోన్ ద్వారా సర్వే చేస్తామన్నారు. ఆర్డీవో మధుసూదన్, ల్యాండ్, రెవెన్యూ ఏడీ వెంకట్‌రెడ్డి, డీఐ విఠల్, ఇన్‌చార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐలు శ్రీనివాస్, రాహుల్, రైతులు పాల్గొన్నారు.
బయో మైనింగ్ పరిశీలన
మెట్‌పల్లి: ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తను ఎరువుగా మార్చడానికి బయోమైనింగ్ చేపడుతున్నట్లు మెట్‌పల్లి కమిషనర్ మోహన్ తెలిపారు. పట్టణ శివారులోని డంపింగ్ యార్డులో ఏర్పాటుచేసిన బయో మైనింగ్ మిషన్‌ను శనివారం ప్రారంభించారు. చెత్తను ఎరువుగా మార్చడం ద్వారా మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డీఈ నాగేశ్వర్‌రావు, ఏఈ తిరుపతి, ఇన్‌చార్జి శానిటరీ ఇన్స్‌పెక్టర్ రత్నాకర్, విష్ణు, ముజీ ఉన్నారు.
జిల్లాలో భారీ వర్షం
జగిత్యాలరూరల్: జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. శనివారం నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. వెల్గటూర్ మండలం మారేడుపల్లిలో 65.8 మిల్లీమీటర్లు, బుగ్గారం మండలం సిరికొండలో 56.8, కొడిమ్యాల మండలం తిమ్మాపూర్‌లో 54.8, మల్యాలలో 46.4, గొల్లపల్లిలో 44.3, కొడిమ్యాల మండలం పూడూరులో 39, ఎండపల్లిలో 38.8, జగిత్యాలలో 36, ధర్మపురి మండలం నేరెళ్లలో 31.3 మిల్లీమీటర్ల వర్షపాతంగా నమోదైంది. అతి స్వల్పంగా మల్లాపూర్ మండలం రాఘవపేటలో 0.5 మిల్లీమీటర్లుగా నమోదైంది.
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు
మెట్‌పల్లి: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ స్పష్టం చేశారు. పట్టణంలోని సాయి సీడ్ ప్లాంట్‌లో శనివారం తనిఖీలు నిర్వహించారు. ప్రాసెసింగ్ ప్లాంట్, సీడ్ ప్రాసెస్, రా సీడ్ మెటీరియల్, బ్యాగింగ్ తదితర వాటిని పరిశీలించారు. వ్యాపారులు రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలన్నారు. ఆయన వెంట ఏడీఏ రమేశ్, ఏఓ దీపిక తదితరులున్నారు.

‘పోషణ్ అభియాన్’లో జిల్లా ప్రథమస్థానం

‘పోషణ్ అభియాన్’లో జిల్లా ప్రథమస్థానం