
ఎంసీహెచ్‌లో విచారణ
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఆదివారం బాబు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషయమై ‘సాక్షి’ ‘నిర్లక్ష్యం వీడని వైద్యులు’ శీర్షికన కథనం ప్రచురించింది. కలెక్టర్ సత్యప్రసాద్ స్పందించారు. విచారణ చేపట్టాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ను ఆదేశించారు. ఆయన మంగళవారం మాతాశిశు కేంద్రానికి వెళ్లి వైద్యులను విచారించారు. బాబు ఎలా మృతిచెందాడు..? ఆస్పత్రిలో ఏం జరుగుతోంది..? అనే నివేదికను కలెక్టర్ కు అందించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన వెంట ఆర్‌ఎంవో సుమన్‌రావు ఉన్నారు.