మల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

మల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు

May 16 2025 1:50 AM | Updated on May 16 2025 1:50 AM

మల్లి

మల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు

మల్లాపూర్‌: మండలంలోని రాఘవపేటలో శ్రీమేడాలమ్మ కేతమ్మ సహిత శ్రీమల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలను శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. దేవతార్చన, అగ్నిప్రతిష్ట, హోమాలు, బలిహరణం, పూర్ణాహుతి, కుంబాభిషేకం, శాంతికల్యాణం పూజలు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బైరి రాకేశ్‌యాదవ్‌, ఉపాధ్యక్షుడు తాలుక మల్లయ్య, కోశాధికారి బైరి రవికుమార్‌యాదవ్‌, సంఘం సభ్యులు పెద్దులు బక్కన్న, రాజేశం, రాజేందర్‌, దేవన్న, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పదోన్నతి బాధ్యతలను పెంచుతుంది

జగిత్యాలక్రైం: పోలీసు శాఖలో పదోన్నతి మరింత బాధ్యతలను పెంచుతుందని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆర్మ్‌డ్‌ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఏఆర్‌ ఎస్సైగా పదోన్నతి పొందిన జాదవ్‌ గోఖుల్‌కు పదోన్నతి చిహ్నాన్ని అందజేశారు. పదోన్నతి పొందిన ఉద్యోగి బాధ్యతతో పాటు క్రమశిక్షణగా విధులు నిర్వహిస్తూ ప్రజల్లో పోలీసు శాఖపట్ల నమ్మకం, గౌవవాన్ని పెంచేలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ భీంరావ్‌, రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌ పాల్గొన్నారు.

తిరంగా ర్యాలీ

జగిత్యాలటౌన్‌: పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ విజయాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలో భారత్‌ సురక్షా సమితి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ పతాకాలు చేతపట్టుకొని పట్టణంలోని తహసీల్‌ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్‌, రాంబజార్‌, టవర్‌సర్కిల్‌ మీదుగా ర్యాలీ సాగింది. అనంతరం భారత్‌ సురక్షా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసీఎస్‌ రాజు మాట్లాడుతూ ఆపరేషన్‌ సిందూర్‌ విజయానికి సూచికగా భారత ప్రజలంతా తిరంగా ర్యాలీలు నిర్వహించడం దేశ ఐక్యతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ గాజుల నగేశ్‌, నాయకులు పుప్పాల సత్యనారాయణ, చిట్ల గంగాధర్‌, బోయిన పద్మాకర్‌, అక్కినపెల్లి కాశీనాథం, మ్యాన సుధాకర్‌, నరేందుల శ్రీనివాస్‌, చంద సుగుణాకర్‌రావు, బండి సత్యనారాయణ, రాపర్తి రవి తదితరులు పాల్గొన్నారు.

రక్త నిల్వలు పెంచుకోవాలి

జగిత్యాల: జిల్లాలో రక్త నిల్వలు పెంచుకోవాలని, రక్తదాతల సహకారం ఉండాలని జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఉపేందర్‌ అన్నారు. గురువారం పట్టణంలోని ఐఎంఏ హాల్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం ఎంతో గొప్పదని, అత్యవసర పరిస్థితుల్లో మన ప్రాంతంలో అందుబాటులో గల రక్తనిల్వలను గురించి తెలుసుకోవడానికి రక్త కోశ్‌ అనే మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ యాప్‌ ద్వారా మన ప్రాంతంలో గల బ్లడ్‌ బ్యాంక్‌ వివరాలు, ప్రతీ గ్రూప్‌ రక్తనిల్వల సంఖ్య తెలుసుకోవచ్చని తెలిపారు. ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్‌ మాట్లాడుతూ ప్రతీనెల రక్తశిబిరాలు నిర్వహిస్తున్నామని, గ్రామీణ ప్రాంత యువకులు ముందుకు వచ్చి 26 మంది రక్తదానం చేశారన్నారు. అనంతరం వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి సుదీర్‌కుమార్‌, మోహన్‌రెడ్డి, సతీశ్‌కుమార్‌, గురువారెడ్డి పాల్గొన్నారు.

మల్లికార్జునస్వామి  విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు
1
1/2

మల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు

మల్లికార్జునస్వామి  విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు
2
2/2

మల్లికార్జునస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement