
కలెక్టర్ ఆదేశించినా అమలు కావడం లేదు
జగిత్యాల: మామిడి మార్కెట్‌లో వేలం నిర్వహించి పంట కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించినా కిందిస్థాయి అధికారులు అమలు చేయక రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక రైతులు, కూలీలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా సౌకర్యంగా ఉండాలని మామిడి మార్కెట్‌ను అభివృద్ధి చేశామన్నారు. మార్కెట్‌లో వేలం పాట నిర్వహిస్తే రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్‌కు విన్నవించగా స్పందించి మార్కెట్‌ను సందర్శించి ఇక్కడే వేలం పాటలు జరపాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కామన్‌ప్లేస్‌లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వేలం నిర్వహించాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. మామిడి మార్కెట్‌లో జరుగుతున్న అవకతవకలకు జిల్లా మార్కెట్ శాఖ అధికారి, మార్కెట్ శాఖ కార్యదర్శిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని జీవన్‌రెడ్డి కోరారు.
2.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
జిల్లాలో ఇప్పటివరకు 2.60 లక్షల మెట్రిక్ ట న్నుల వరిధాన్యం సేకరించినట్లు జీవన్‌రెడ్డి తెలి పారు. సేకరించిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో రెండు రోజుల్లో డబ్బులు జమవుతాయన్నారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి బండ శంకర్, నాయకులు దుర్గయ్య, నందయ్య, రాజేందర్, రమేశ్‌రా వు, షేక్‌చాంద్‌పాషా, ఽరమేశ్‌బాబు పాల్గొన్నారు.