
సాగుపై ప్రయోగాత్మకంగా పరిశీలన
జమ్మికుంట: నాబార్డు ఆర్థిక సాయంతో దుక్కి దున్నకుండా పంటల సాగుపై ప్రయోగాత్మకంగా పరిశీలన జరుగుతుందని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ కరీంనగర్ డీడీఎం జయప్రకాశ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కేవీకేలో నాబార్డు ఆర్థిక సహకారంతో దుక్కి దున్నకుండా పంటల సాగు, సుగుణ పునరుత్పాదక పద్ధతి ప్రాజెక్టును ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా 3 మండలాల్లోని 16 గ్రామాల్లో 25 మంది రైతులతో 25 ఎకరాల వ్యవసాయ కేత్రంలో దుక్కి దున్నకుండా పంటల సాగు జరుగుతుందన్నారు. నూతన సాంకేతిక పద్ధతులకు నాబార్డు ముందుండి ఆర్థిక సాయం చేసి ప్రోత్సహిస్తుందని అన్నారు. సుగుణ పునరుత్పాదక పద్ధతితో నేల రక్షణతోపాటు రసాయన ఎరువుల వాడకం తగ్గించొచ్చన్నారు. జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి శ్రీనివాస్‌రావు, జిల్లా లీడ్ మేనేజర్ ఆంజనేయులు, సుగుణ పునరుత్పాదక పద్ధతి రూపకర్త చంద్రశేఖర్, సీనియర్ కేవీకే శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, అనుంబంధ రంగాల అధికారులు, రైతు ఉత్పత్తిదారుల సంఘం సభ్యులు, రైతులు పాల్గొన్నారు.