
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి కురిసిన అకాలవర్షానికి ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట ఐకేపీ కేంద్రంలోకి భారీ వరద చేరడంతో రైతులు దిక్కుతోచనిస్థితిలో పడ్డారు.
సారంగాపూర్‌లో నిలిచిన విద్యుత్ సరఫరా
సారంగాపూర్: సారంగాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, ధాన్యంబస్తాలు తడిసిపోయాయి. మండల కేంద్రంతోపాటు, పలు గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. శనివారం వేకువజాము మూడు గంటల ప్రాంతంలో విద్యుత్‌ను పునరుద్ధరించారు.

అకాల వర్షం.. తడిసిన ధాన్యం