
పత్రికా స్వేచ్ఛపై దాడి సరికాదు
జగిత్యాల: నిజాన్ని నిర్భయంగా రాస్తున్న ‘సాక్షి’ దినపత్రికను అణగదొక్కేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ ని జర్నలిస్టులు అన్నారు. శుక్రవారం జగిత్యాలలో ర్యాలీ నిర్వహించి తహసీల్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విజయవాడలోని ఎడిటర్ ధనంజ యరెడ్డి ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురిచేయ డం సమంజసం కాదన్నారు. రాజకీయ కక్షతోనే ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నా రు. పోలీసుల వేధింపులు ఆపకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు కె.శశిధర్, చంద్రశేఖర్, కుమార్, మల్లారెడ్డి, సత్యనారాయణగౌడ్, శ్రీకర్, సుబ్బారెడ్డి, హైదర్, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్, మోసిత్, శ్రీను, సత్యం, హరికృష్ణ, శేఖర్, బండ స్వామి, షఫీ, ఆనంద్, రంజిత్, ఆయా సంఘాల నాయకులు వొల్లం మల్లేశం, మహేశ్ పాల్గొన్నారు.