
ఏఎన్‌ఎం నుంచి వైస్ ప్రిన్సిపాల్ వరకు
సేవామూర్తులు
అనారోగ్యం పాలైనప్పుడు రక్తసంబంధీకులే దరిచేరని రోజులివీ. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకూ మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిదీ. అచేతన స్థితిలో ఉన్నవారికి ఏ సంబంధం లేకపోయినా చిరునవ్వుతో దేవదూతల్లా నర్సింగ్ ఆఫీసర్లు సకల సేవలందిస్తున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా అనారోగ్యం బారినపడి ఆసుపత్రుల్లో చేరిన వారిని అమ్మ కన్నా మిన్నగా నర్సులు చూసుకుంటున్నారు. తెల్లని దుస్తుల్లో మిలమిలా మెరుస్తూ.. చిరునవ్వులు చిందిస్తూ.. వారు అందించే సేవలు నిరుపమానం. రోగి అవసరం ఏదైనా చిటికెలో తీర్చడమో, తీర్చేందుకు ప్రయత్నించడమో చేస్తూ పేషెంట్లకు భరోసా కల్పిస్తారు. పైకి గంభీరంగా కనిపించినా పేషెంట్ ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తూ రోగుల పాలిట దైవాలుగా నిలుస్తున్నారు నర్సులు. నేడు నర్సింగ్ డే సందర్భంగా కథనం.
– కరీంనగర్‌టౌన్/కోల్‌సిటీ
మదర్ థెరిసాను రోల్డ్ మోడల్‌గా తీసుకున్నా. వైద్య సేవలపై ఆసక్తితో ఏఎన్‌ఎం స్థాయి నుంచి నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సి పాల్ హోదా వరకు చేరుకున్నాను. ఇంటర్ చదివే వయసులోనే ఏఎన్‌ఎమ్‌గా ఉద్యోగం వచ్చింది. ఇదే స్ఫూర్తితో జనరల్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ తోపాటు సైకాలజీ, పీడియాట్రిక్, ఏంఎస్‌డబ్ల్యూ కోర్సులు చదివాను. పేషెంట్లకు ఎదురుపడిన నర్సింగ్ ఆఫీసర్లు చక్కని చిరునవ్వుతో పలకరించి వైద్యం అందించాలని దృక్పథం నాలో బలంగా నాటుకుంది. అందుకే 2013 నుంచి 2022 వరకు స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్నకాలంలో డిప్యూటేషన్‌పై కరీంనగర్ నర్సింగ్ స్కూల్‌లో ట్యూటర్‌గా పాఠాలు బోధించాను. 2022లో పదోన్నతిపై సిరిసిల్ల నర్సింగ్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశా. గతేడాది అక్టోబర్ 30న రామగుండం నర్సింగ్ కళాశాలకు వైస్ ప్రిన్సిపాల్‌గా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. రోగులకు వైద్యం అందించడంలో నర్సింగ్ ఆఫీసర్ల సేవలు కీలకమైనవి.
– సుశీల, వైస్ ప్రిన్సిపాల్, నర్సింగ్ కళాశాల, గోదావరిఖని
00000
00 0000 000000 000000 000000 000000
00000
00 0000 000000 000000 000000 000000
– వివరాలు 8లో

ఏఎన్‌ఎం నుంచి వైస్ ప్రిన్సిపాల్ వరకు

ఏఎన్‌ఎం నుంచి వైస్ ప్రిన్సిపాల్ వరకు