హనుమాన్ పెద్ద జయంతి పోస్టర్ ఆవిష్కరణ
మల్యాల: కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల పోస్టర్‌ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఆలయ అధికారులు, అర్చకులు ఆదివారం ఆవిష్కరించారు. ఈఓ శ్రీకాంత్‌రావు, సూపరింటెండెంట్లు సునీల్‌కుమార్, హరిహరనాథ్, స్థానాచార్యులు కపీందర్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవిస్వామి ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రం అందించారు.
38 మంది హెడ్‌కానిస్టేబుళ్లు బదిలీ
జగిత్యాలక్రైం: జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న 38 మంది హెడ్‌కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారు వారికి కేటాయించిన పోలీస్‌స్టేషన్లలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. అలాగే ఇతర జిల్లాలో పనిచేస్తున్న 9 మంది హెడ్‌కానిస్టేబుళ్లను జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పవర్ లిఫ్టింగ్‌లో
బాలికల సత్తా
ధర్మపురి: ఏషియన్ చాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఇద్దరు విద్యార్థినులు ప్రతిభ చాటారు. పేద కుటుంబంలో జన్మించిన వీరిలో ఒకరు బంగారు పతకం, మరొకరు వెండి పతకాలు సాధించి కళాశాల, జిల్లా, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ధర్మపురికి చెందిన శ్యాంరావు ఐశ్వర్య, మండలంలోని కమలాపూర్‌కు చెందిన కుమ్మరి పూజిత ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు ఉత్తరఖండ్‌లోని డెహ్రా డూన్‌లో నిర్వహించే ఏషియన్ చాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఇందులో ఐశ్వర్య 52 కిలోల బరువు ఎత్తి బంగారు పతకం, కుమ్మరి పూజిత 76 కిలోల బరు వు ఎత్తి సిల్వర్ పతకం సాధించింది. వీరిద్దరూ ప్ర స్తుతం కరీంనగర్‌లో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు.
హనుమాన్ పెద్ద జయంతి పోస్టర్ ఆవిష్కరణ


